సీనియర్ ఎన్టీఆర్..తెలుగు సినిమా రంగానికి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానంతో పాటు తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎన్టీఆర్. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. కాగా, ఇప్పటికీ తెలుగు వారి ఇళ్లలో ఎన్టీఆర్ ఫొటోలు ఉంటాయి. రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ ఉన్న ఫొటోలను తమ లోగిళ్లలో పెట్టుకుని తెలుగు వారు పూజిస్తుంటారు. అలా ఎన్టీఆర్ అంటే తమకు ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంటారు.
ఇక ఎన్టీఆర్ తనకు నచ్చిన సినిమాలను తన హోమ్ థియేటర్ లో చూసేస్తుంటారు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన ‘భక్తకన్నప్ప’ చిత్రం అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. తన చిత్రం కాకుండా ఇతర భాష నటుడు అయిన రాజ్ కుమార్ చిత్రం ఆయనకు బాగా నచ్చింది. ఆ సినిమాతో పాటు ఆయనకు ఇష్టమైన పిక్చర్స్ ఇంకా చాలానే ఉన్నాయి.
ఇక ఎన్టీఆర్ స్వయంగా తీసిన ‘శ్రీకృష్ణ పాండవీయం’ ఫిల్మ్ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఎన్టీఆర్ ఆ చిత్రాలు చూసి ఆనందపడేవారు. ఎన్టీఆర్ స్వయంగా రాసుకున్న పిక్చర్ ‘శ్రీనాథ కవిసార్వభౌమ’. బాపు దర్శకత్వంతో తెరకెక్కిన ఈ మూవీ.. మహాకవి శ్రీనాథుడి జీవిత విశేషాలపైన ఉంటుంది. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ ఉండబోవు.
ఇందులో జయసుధ హీరోయిన్. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. స్వయంగా ఆయనే మేకప్ వేసుకుని ఈ మూవీ తీశారు. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేశారు. కానీ, ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ తనకు ఇష్టమైన చిత్రమని ఎన్టీఆర్ చెప్పారు. ‘శ్రీకృష్ణపాండవీయం’ కూడా తనకు ఇష్టమైన చిత్రమని సీనియర్ ఎన్టీఆర్ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ నటవారసులుగా ఆయన తనయుడు బాలయ్య సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు.