కాస్త ఆలస్యం కానున్న టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు..

-

తెలంగాణ ఎంసెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పరీక్ష ఫలితాలను వచ్చే వారం ప్రకటించనున్నట్లు తెలిపారు అధికారులు. వాస్తవానికి ఈ వారమే రిజల్ట్స్ వస్తాయని భావించినా వారం ఆలస్యంగా ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఎంసెట్ లో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు.

TS EAMCET 2022 likely in June

గత నెల 30, 31వ తేదీల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 18, 19, 20వ తేదీల్లో జరిగిన పరీక్షకు 1,56,812 మంది హాజరయ్యారని తెలిపారు అధికారులు. ‘తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చే వారం విడుదలుతాయి. ఇంజినీరింగ్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌కు అనుసంధానం చేశారు. కాబట్టి, ఇది అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది. నవంబర్ 1 నుంచి క్లాస్‌వర్క్ ప్రారంభమవుతుందని తెలిపారు రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news