నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ వెంటనే స్పందించింది. అయితే.. తాజాగా.. నీతి ఆయోగ్ రాజకీయరంగును పులుముకుందని.. బీజేపీకి వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నీతి ఆయోగ్‌పై ఘాటుగానే స్పందించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాల్సింది పోయి.. తప్పుడు ప్రకటన చేసిందంటూ ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిందని, పథకాల అమలుకోసం నీతిఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులుమంజూరు చేయలేదని, ఇప్పుడేమో నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్ చెబుతోందని మండిపడ్డారు హరీష్ రావు. రూ.24వేల కోట్లు ఇవ్వాలని అడిగతే పైసా విదల్చలేదని, ఇక ఆ వ్యవస్థకు ఏం విలువ ఉంది? అని ప్రశ్నించారు హరీష్ రావు. రావాల్సిన నిధులు మంజూరు చేయాలని చాలా సార్లు వేడుకున్నామన్నారు. ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, మన్మోహన్ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయని హరీశ్‌రావు పేర్కొన్నారు హరీష్ రావు.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకు..? అంటూ ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫారసులను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని, దీనిపై నీతి ఆయోగ్ ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. నీతి ఆయోగ్ ప్రకటన సత్యదూరమని.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు హరీష్ రావు. నీతిఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్తబుట్టలో వేసిందని, కేంద్రం సెస్‌లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ఆరోపించారు హరీష్ రావు. సెస్‌ల ద్వారా కేంద్రం 15.47 లక్షల కోట్లు సమకూర్చుకుందని.. అందులో రాష్ట్రాల వాటా 8.60 లక్షల కోట్లు రావాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని దుయ్యాబట్టారు. నీతిఆయోగ్ అంకెల గారడి చేస్తోందని హరీష్‌రావు మండిపడ్డారు. 2015-16లో సీఎస్ఎస్ ద్వారా రూ.6వేల కోట్లు వచ్చాయని, 2016-17రూ.6,695 కోట్లు వచ్చాయని వివరించారు హరీష్ రావు.