ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ విత్ డ్రా చేసింది : నిర్మలా సీతారామన్‌

-

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలియ పరచకుండా, వారి సమ్మతి లేకుండా ఉద్యోగుల జీపీఏఫ్ ఖాతాల నుండి 2021 మరియు 2022 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీపీఏఫ్ సొమ్ము రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ సమ్మతితోనే విత్ డ్రా చేసిందా అని కేశినేని నాని లోక్‌ సభలో ప్రశ్న సంధించారు. అయితే.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ పై లోక్ సభలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్ డ్రా చేసిందని వెల్లడించింది కేంద్రం. 2021-22లో రూ.413.73 కోట్లు విత్ డ్రా చేసినట్టు వివరించింది కేంద్ర ఆర్థికశాఖ. నాని అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Lok Sabha passes Finance Bill, Nirmala Sitharaman says tax proposals will  improve ease of living

కాగా, ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల ఉపసంహరణ అంశం ఏపీ హైకోర్టులోనూ విచారణకు రావడం తెలిసిందే. సాంకేతిక కారణాల వల్లే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము విత్ డ్రా చేయడం జరిగిందని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ నాడు వాదనలు వినిపించారు. బడ్జెట్ మంజూరు అయితే, ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము తిరిగి జమ చేస్తామని అన్నారు. ఇంకా ఆయన పలు కారణాలు వివరించేందుకు ప్రయత్నించగా, హైకోర్టు స్పందిస్తూ, ప్రభుత్వం చెప్పే వివరాలు కాగ్ కు కూడా అర్థంకావని పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news