మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర కేసు బూటకం అంటూ కోర్టును రాఘవేంద్రరాజు, విశ్వనాథ్ భార్య పుష్పలత ఆశ్రయించారు. కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించిన పిటీషనర్స్.. పిటిషన్ ను కాగ్నిజెన్స్ గా పరిగణలోకి తీసుకుంది న్యాయస్థానం.
ఇక నేడు కోర్టుకు హాజరుకావాలని ప్రతివాదులకు నోటీసులు చేసింది కోర్టు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ తో ఇతర పోలీస్ అధికారులు సహా 12 మందికి నోటీసులు జారీ చేసింది. గత నెలలో రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేసిన రాఘవేంద్ర రాజు, విశ్వనాథ్ బార్య పుష్పలత.. శ్రీనివాస్ గౌడ్ పై ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు చేశామని తప్పుడు కేసులు పెట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు రాజు.
తన ఇంట్లోకి చొరబడి సీసీటీవీ, పెన్ డ్రైవ్ హార్దిస్కులను దొంగలించి, ద్వంసం చేశారని పిటిషన్ లో తెలిపారు రాజు. ఎలక్షన్ కమిషన్ పిర్యాదుచేసినందుకు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పేర్కొన్నారు విశ్వనాధ్ బార్య పుష్ప లత. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కు కుట్ర పన్నారని ఫిబ్రవరి లో రాజు, విశ్వనాథ్ తదితరులను అరెస్ట్ చేసారు పోలీసులు. బెయిల్ పై బయటికి వచ్చాక మహబూబ్ నగర్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.