ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు పెన్షన్లు – మంత్రి కేటీఆర్

-

సీఎం కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు పదిరెట్లు పెరిగాయని.. ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు పెన్షన్లు ఇస్తామని ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్‌. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామని వెల్లడించారు. 13.30 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు ఇచ్చామన్నారు. అనవసర సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలు పెంచాలని తెలిపారు.

సహజ ప్రసవం చేయించే వైద్య సిబ్బందికి రూ.3 వేల ప్రోత్సాహకం ఇస్తున్నామని.. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం కోటా తగ్గించిందని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తున్నామని.. మిషన్‌ భగీరథ వల్ల మంచినీళ్ల తో ఫ్లోరోసిస్‌ మహమ్మారిని తరికొట్టామని గుర్తు చేశారు.
ఇప్పుడు హర్‌ ఘర్‌ జల్‌ పేరుతో కేంద్రం ఏదో ప్రయత్నం చేస్తుందని వివరించారు.

రేపు రాఖీ పండగ సందర్భంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న మహిళా గురుకుల కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను సందర్శించి రాఖి పండగను అక్కడి విద్యార్థినులతో జరుపుకోవాలి. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news