PF Withdrawal: పీఎఫ్ డబ్బులను మధ్యలో ఇలా విత్‌డ్రా చేసుకోండి..!

-

పీఎఫ్ డబ్బులను కేవలం రిటైర్ అయ్యాకనే తీసుకోవాలి.. లేదా ఉద్యోగి ఉద్యోగం మానేస్తేనే తీసుకోవాలి.. అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే.. పీఎఫ్‌ను మధ్యలో కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.

పీఎఫ్.. ప్రతి ఉద్యోగికి పీఎప్ అకౌంట్ ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగి అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా.. చిన్న కంపెనీ అయినా.. పెద్ద కంపెనీ అయినా ఎవరికైనా పీఎఫ్ అకౌంట్ తప్పనిసరి. ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులను కంపెనీయే జమ చేస్తుంది. ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 12 శాతాన్ని కట్ చేసి పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తారు. కొన్ని కంపెనీలు అయితే కంపెనీ తరుపున కూడా పీఎఫ్‌ను కట్ చేసి సదరు ఉద్యోగి పెన్షన్‌కు కంట్రిబ్యూట్ చేస్తాయి.

అయితే.. పీఎఫ్ డబ్బులను కేవలం రిటైర్ అయ్యాకనే తీసుకోవాలి.. లేదా ఉద్యోగి ఉద్యోగం మానేస్తేనే తీసుకోవాలి.. అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే.. పీఎఫ్‌ను మధ్యలో కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.

అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దాని కోసం పీఎఫ్ అడ్వాన్స్ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవాలి. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఆ ఆప్షన్‌ను ఉపయోగించుకోవాలి. అనారోగ్య పరిస్థితుల్లో, ఆసుపత్రి ఖర్చుల కోసం, పెళ్లి ఖర్చుల కోసం, ఉన్నత విద్య కోసం, కొత్త ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం.. ఇలాంటి కారణాలతో మాత్రం పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే.. ఎంత వరకు అడ్వాన్స్‌గా పీఎఫ్ డబ్బులను తీసుకోవచ్చు.. ఏఏ కారణాలతో ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చే ఇప్పుడు తెలుసుకుందాం.

ఉన్నత విద్య కోసం

తమ పిల్లల ఉన్నత విద్య కోసం ఉద్యోగులు పీఎఫ్‌ను అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే.. ఉన్నత విద్య కోసం విత్‌డ్రా చేసుకోవాలంటే మాత్రం కనీసం ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి వాటా నుంచి వడ్డీని కలిపి 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉన్నత విద్య కారణంగా చూపి మూడు సార్లు మాత్రమే పీఎఫ్‌ను ముందుగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

పెళ్లి కోసం

చాలామంది ఉద్యోగులు తమ పెళ్లికి కానీ.. తమ పిల్లల పెళ్లికి గానీ.. ఇతర బంధువుల పెళ్లికి గానీ ఖర్చుల కోసం పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకుంటారు. అయితే.. పెళ్లి కారణంతో కూడా పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 50 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి కనీసం ఏడేళ్లు అయి ఉండాలి. మూడుసార్లు పెళ్లి కారణం చెప్పి అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇంటి నిర్మాణం కోసం లేదా ఇంటి కొనుగోలు కోసం

చాలామంది ఉద్యోగులు సొంతింటి కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. కాకపోతే సమయానికి డబ్బులు సర్దుబాటు కావు. అందుకే.. కొత్త ఇల్లు కానీ.. ప్లాట్ గానీ.. ఇంటి నిర్మాణం చేసినప్పుడు కానీ పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. కాకపోతే పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని ఉండాలి. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఒకే ఒక సారి మాత్రమే ఈ కారణంతో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు కోసం అయ్యే ఖర్చు లేదా 36 నెలల బేసిక్ వేతనం, డీఏను విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ఉద్యోగి, యజమాని వాటా వడ్డీతో కలిపి తీసుకోవచ్చు.

అనారోగ్య కారణాల వల్ల

అనారోగ్యానికి గురయినా.. వైద్య ఖర్చుల కోసం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి వాటా మొత్తాన్ని లేదా ఆరు నెలల బేసిక్ సాలరీ, డీఏను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. కనీస సర్వీస్ కాలం లాంటి నియమాలేవీ దీనికి వర్తించవు.

రిటైర్‌మెంట్ సమయంలో

ఉద్యోగి తనకు 54 ఏళ్లు వచ్చాక పీఎఫ్ మొత్తం నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. రిటైర్‌మెంట్‌కు ఏడాది ముందు కూడా పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

అన్‌ఎంప్లాయిమెంట్

కొన్ని కారణాల వల్ల చాలామంది మధ్యలో ఉద్యోగాలను వదిలేస్తుంటారు. ఒక నెల కంటే ఎక్కువ సమయం ఉద్యోగాన్ని వదిలేస్తే పీఎఫ్ మొత్తంలో 75 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news