కడుపు ఉబ్బరంగా ఉందని సోడా తాగుతున్నారా..? ప్రమాదమే..!

-

మసాల ఐటమ్స్‌ తిన్నప్పుడు చాలా మందికి గ్యాస్‌ పట్టేసినట్లు అవుతుంది. ఉబ్బరంగా ఉంది అని సోడాలు తాగుతారు. దాని వల్ల గ్యాస్‌ నుంచి రిలీఫ్‌ అవుతుంది. అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు కానీ.. సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అంటున్నారు వైద్యులు. చాలామంది అదేదో హెల్తీ టానిక్‌లా డైలీ నైట్‌ భోజనం తర్వాత తీసుకుంటారు.. ఇంకొంత మంది మద్యంలో కలుపుకుంటారు. ఇలా చేయడం వల్ల జరిగే పరిణామాలు గురించి చూద్దాం..!

సోడా తాగడం వల్ల కలిగే నష్టాలు..

ఆస్తమాని ప్రేరేపిస్తాయి- ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.

ఎముకలు బలహీనం అవుతాయి- రోజూ సోడా తాగితే.. ఎముకలు బలహీనమవుతాయి. ఎందుకంటే సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. కావున సోడా వినియోగానికి దూరంగా ఉండాలి.

గుండె జబ్బుల ప్రమాదం- రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అందువల్ల దాని వినియోగానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాన్సర్ వచ్చే ప్రమాదం- కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు.

కాబట్టి చీటికిమాటికి సోడా తాగే అలవాటు ఉంటే కాస్త జాగ్రత్తపడటం ఉత్తమం. ఏదైనా పరిమితికి మించే తీసుకుంటే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అది ఆహారం అయినా, పరిచయం అయినా సరే.. ఒకదాని తర్వాత ఒక వైరస్‌ వస్తున్న ఈరోజుల్లో..ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం తెలిసి తెలియక చేసే ఇలాంటి పొరపాట్ల వల్ల ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకున్నవాళ్లమవుతాయి. గ్యాస్‌నొప్పి ఉంటే..యాలుకలు తినండి, వేడి నీళ్లు టీ తాగినట్లు తాగండి, హెర్బల్‌ టీ తాగండి. ఇలాంటి హోమ్‌ రెమిడీస్‌ చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.!

Read more RELATED
Recommended to you

Latest news