అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్నారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సేజ్ లో ఏ టి సి అలయన్స్ టైర్స్ కంపెనీని ప్రారంభించారు సీఎం జగన్. 8 పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అవార్డు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో రూ 1.54 లక్షల కోట్ల పెట్టుబడిలతో వచ్చే రెండేళ్లలో 56 కంపెనీలో రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పారు.
వీటి వల్ల యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని అన్నారు. విశాఖలో వచ్చే రెండు నెలల్లో ఆదాని డేటా సంస్థకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయని అన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు సీఎం జగన్.