ఢిల్లీలో కరెంటు ఉండదు.. హైదరాబాదులో కరెంట్ అసలు పోదు – సీఎం కేసీఆర్

-

బుధవారం మేడ్చల్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం అంతాయిపల్లి లో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 30 ఎకరాల్లో 56 కోట్ల 20 లక్షల రూపాయలతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించగా.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భవనాన్ని పూర్తిగా పరిశీలించారు.

అక్కడినుండి అంతాయిపల్లి ఐడిఓసి పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు సీఎం కేసీఆర్. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఆరు నెలల్లోనే కొత్త భవనాలు నిర్మించామని తెలిపారు. తెలంగాణలో కరెంటు కష్టాలు తీరిపోయాయని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వస్తే.. రాష్ట్రం చీకటిమయం అవుతుందని అన్నారని.. అలాంటిది ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని అన్నారు. ఢిల్లీలో 24 గంటలు కరెంటు ఉండదని.. హైదరాబాదులో కరెంటు అసలు పోదని అన్నారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news