ఫేస్ రికాగ్నిషన్ యాప్ పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది : మంత్రి బొత్స

-

ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు కూడా అటెండెన్స్‌లో ఖచ్చితత్వం పాటించాలని.. ఫేస్‌ రికాగ్నిషన్‌ యాప్‌ను ప్రవేశపెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ యాప్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉండటంతో ఉపాధ్యాయులు ఫేస్‌ రికాగ్నిషన్‌ యాప్‌తో తలనొప్పిగా తయారైంది. అయితే.. ఈ నేపథ్యంలో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చలు జరపగా, ఆ చర్చలు విఫలం అయ్యాయి. చర్చల సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఫేస్ రికాగ్నిషన్ యాప్ పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అన్నారు. 15 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి యాప్ అమల్లోకి తెస్తామని చెప్పారు. ఈ నెలాఖరులోపు టీచర్లకు శిక్షణ షురూ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి బొత్స. యాప్ లో ఇప్పటికే లక్ష మంది ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకున్నారని, మిగతా 50 శాతం మంది త్వరలోనే రిజిస్టర్ చేసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు మంత్రి బొత్స.

Botsa Satyanarayana likely to have sway in N. Andhra

హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి బొత్స. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బొత్స పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో ముందుకుపోతున్నామని, ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి బొత్స. మున్ముందు మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావొచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు మంత్రి బొత్స. సెల్ ఫోన్లు ఉద్యోగులవా, లేక ప్రభుత్వమే ఇస్తుందా? అనేది ఆయా శాఖల నిర్ణయం అని వివరించారు మంత్రి బొత్స. అటు, ఉపాధ్యాయులు స్పందిస్తూ, సొంత ఫోన్లలో ఫేస్ రికాగ్నిషన్ యాప్ కు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స. సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు మంత్రి బొత్స. ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు మంత్రి బొత్స.

 

 

Read more RELATED
Recommended to you

Latest news