కృష్ణాలో ఆ ఒక్క ఎమ్మెల్యే సీటే డౌట్?

-

వచ్చే ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి సీట్లు ఫిక్స్ అవుతాయా? అంటే చెప్పలేని పరిస్తితి… ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది.. అలాంటి వారికి సీట్లు ఇస్తే మళ్ళీ గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలో కొందరికి సీట్లు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరికి 2019 ఎన్నికల్లో జగన్ సీటు ఇవ్వలేదు.

2014లో వైసీపీ తరుపున 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.. ఇందులో కొందరు టీడీపీలోకి వెళ్లిపోయారు. అయితే మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ 2019 ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదు…కొందరిని పక్కన పెట్టేశారు. ఇక ఈ సారి కూడా అదే చేయడానికి జగన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు…టీడీపీ-జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని లెక్క పెడితే…156 మంది…మరి వీరందరికి నెక్స్ట్ సీటు ఇస్తారా? అంటే కష్టమే అని చెప్పొచ్చు. దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలకు నెక్స్ట్ సీటు దక్కే అవకాశాలు తక్కువ ఉన్నాయని సమాచారం.

ఇదే క్రమంలో కృష్ణా జిల్లా విషయానికొస్తే ఇక్కడ ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు సీటు దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 16 సీట్లలో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది…ఇక టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీకి వచ్చారు. దీంతో వైసీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ 15 మందికి నెక్స్ట్ సీటు ఇస్తారా అంటే చెప్పలేని పరిస్తితి. ఇందులో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు సీటు మాత్రం డౌట్ అంటున్నారు. ఈయనకు సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు. దీంతో ఈయనకు నెక్స్ట్ సీటు కష్టమే. అటు బందరులో పేర్ని నాని బదులు ఆయన తనయుడు పోటీకి దిగుతున్నారు. ఇక అలాగే జిల్లాలో ఇంకో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా క్లారిటీ రావడం లేదట..మరి చూడాలి ఈ సారి కృష్ణాలో సిట్టింగులు అందరికీ సీట్లు దక్కుతాయో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news