రాజ్యాంగ పదవులు పట్ల ఆసక్తి లేదు.. కానీ ఆ పదవే ఇచ్చారని మోడి సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు. తన ఆత్మీయ సత్కరానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నాకు మిత్రులంద ద్వారా నే ఇంత విజయాన్ని సాధించగలిగాను.. విలువలు పాటిస్తూ ముందుకు నడిచానన్నారు. ఒకప్పుడు నేను అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారి పేర్లు గోడల మీద రాసేవాడిని.. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో కూర్చునే అవకాశం నాకు దక్కిందని తెలిపారు.
నాకు రాజ్యాంగ పదవులు పట్ల ఆసక్తి లేదు.. నాకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పనిచేయడం ఇష్టం, ప్రజల మధ్య ఉండటం అంటే నాకు ఇష్టమని తెలిపారు. ఉపరాష్ట్రపతిలో హోదా, హుందా, గౌరవం ఉండవచ్చు… కానీ నాకు ప్రజల మధ్య ఉండడం ఇష్టం.. పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఇళ్ల స్థలం వచ్చినా నేను తీసుకోలేదని వెల్లడించారు.
ఇదేదో గొప్ప అని కాదు… అందరికీ ఆదర్శంగా ఉండాలని.. పార్లమెంట్ అసెంబ్లీలో వారి ఔన్నత్యం తగ్గుతుంది… ఇది మంచిది కాదన్నారు. వ్యక్తిగత దూషణ మంచిది కాదు, ఇవి తగ్గించుకోవాలి… టీవీలో కూడా అవే చూపిస్తున్నారు…నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి… షేర్ అండ్ కేర్ ఇది పురాతన భారత సంప్రదాయమని వివరించారు.