NDTV షేర్లు కొన్న గౌతమ్ అదానీ.. అతి పెద్ద షేర్‌హోల్డర్‌ కానున్న అదానీ గ్రూప్ !

-

ఇండియాలో  బడా బిలియనీర్ గౌతమ్ ఆదాని..గురించి తెలియని వారుండరు. అయితే ఈ   బడా బిలియనీర్ గౌతమ్ ఆదాని మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దేశంలోని టాప్ ఛానల్ లలో ఒకటైన ఎన్డిటీవీని ఆదాని గ్రూప్ టేక్ ఓవర్ చేయబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డిటీవీలో 29.18 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆదాని గ్రూప్ మరో 26 శాతం వాటాను ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

ఆదాని ఎంటర్ప్రైజెస్ అనుబంధ ఏఎంఎన్ఎల్ ఈ వాట కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఎన్డిటీవీని ఆదాని గ్రూప్ టెక్ ఓవర్ చేయబోతుందన్న వార్త జాతీయస్థాయిలో హాట్ హాట్ గా మారింది. ఇప్పటివరకు బిజెపికి అనుకూలంగా లేని మీడియా సంస్థగా ఎన్డిటీవీకి పేరు ఉంది. కాగా, సోషల్ మీడియా వేదికపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో ముందుండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఆదాని, ఎన్డిటీవీ డీల్ విషయంలో తనదైన శైలిలో స్పందించారు. మోడీ లక్ష్యంగా ట్రీట్ చేశారు. దేశంలో మీడియా మోడీయాగ మారిపోతుందంటూ సెటైర్ వేశారు మంత్రి కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news