కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా బీజేపీలోకే వస్తారు – ధర్మపురి అరవింద్‌

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని… వచ్చే ఎన్నికల నాటికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీజేపీలో ఉంటారేమో..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడంలో భాగంగానే బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయంటూ రేవంత్ ఏదేదో కామెంట్లు చేస్తున్నారు… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడడంలో రేవంత్ రెడ్డి విఫలం అవుతున్నారని చురకలు అంటించారు.

రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ ఫ్రస్ట్రేటేడ్ ఫ్రెండ్ అని.. పోలవరం విషయంలో కేంద్రం మీటింగ్ పెడితే కొన్ని సందర్భాల్లో కేసీఆర్ వెళ్లరు.. కొన్ని సార్లు జగన్ వెళ్లరని ఆగ్రహించారు. ఇలా అయితే ఎలా..? అని నిలదీశారు. షర్మిళ తెలంగాణలో కష్టపడుతున్నారు.. ఆల్ ద బెస్ట్ అని పేర్కొన్నారు.

మా పార్టీలోకి ఎవరొచ్చినా తీసుకుంటామని.. కవిత ప్రతిసారీ ప్రైవేట్ జెట్లల్లో ఎందుకెళ్లారు..? అని నిలదీశారు. కవిత ప్రైవేట్ జెట్లకు తిరిగిన ఖర్చు ఎవరు పెట్టారని మా ఢిల్లీ బీజేపీ వాళ్లు అడిగారని… వాటికి సమాధానం చెప్పకుండా.. కోర్టుకెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు.. దానికి ఏం చేయగలం..? అని నిలదీశారు. సీఎం ఇంటి సభ్యురాలుగా ఉన్న కవిత మరింత బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు అరవింద్‌.

Read more RELATED
Recommended to you

Latest news