పాత బస్తీలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు అడిషనల్ సిపి డిఎస్ చౌహన్. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ముఖ్య పాత్ర వహిస్తుందన్నారు. కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. సామాజిక మాధ్యమాలలో వచ్చే అసత్యాల వలన తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అల్లర్లను అదుపు చేసే పరిస్థితులలో పోలీసులు కొన్ని చర్యలు చేపడతారని పేర్కొన్నారు. ఆ వీడియోలను వైరల్ చేయడం వలన అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు సిపి డిఎస్ చౌహన్.
అల్లర్ల సమయంలో వాటిని కట్టడి చేసేందుకు ఒక అడుగు ముందుకు వేస్తామన్నారు. కానీ వీటిని వైరల్ చేయడం వలన ప్రజల్లో వేరే భావన కలుగుతుందని అన్నారు. యూ ట్యూబ్ చానల్స్ కు విజ్ఞప్తి చేస్తున్నము.. అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు. మీడియా మంచి సహకారం అందిస్తుందన్నారు అడిషనల్ సిపి చౌహన్