తెరాస ను మరో సారి ఆశీర్వదించండి..కేసీఆర్

-

ఇది ఢిల్లీ పెత్తనం – తెలంగాణ ఆత్మగౌరం మధ్య పోరాటం

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన తెరాస అధినేత

రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే ప్రజలు తెరాసను మరో సారి రెన్యువల్ చేసి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ లో ఆయన మాట్లాడుతూ.. అధికారుల ఆత్మవిశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా వారిపై అవాక్కులు.. చవాక్కులు పేల్చడం వల్ల అభివృద్ధికి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో నే అసెంబ్లీని రద్దు చేశాము.. నాడు సమైఖ్య రాష్ట్రంలో జరిగిన జీవనవిధ్వంసం అందరికి తెలుసు..కాంగ్రెస్ పార్టీ మళ్లీ అదే తరహా రాజకీయలు చేయాలనుకుంటోంది..

నాలుగున్నరేళ్లలో నేను చేసిన పనుల గురించి నా కంటే మీకే బాగా తెలుసు… ఎవ్వరు అడగకుండానే కల్యాణ లక్ష్మీ, రైతు బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను మీకు అందించాను.

రాష్ట్ర ఆదాయాన్ని పైసాపైసా కూడబెట్టి ప్రజాల కోసమే అనేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటుని తెరాస ప్రభుత్వం అందించింది. దేశాన్ని యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు తెలంగాణకు చేసిందేమీ లేదు.. వారి స్వలాభం కోసమే అన్ని పనులు చేసుకున్నారు.

తెలంగాణ కోసం చావు నోట్ల తల పెట్టి వెనక్కి వచ్చా…పేగులు తెగే దాక పోరాడాను… 14 ఏళ్ల పోరాట ఫలితంగా కాంగ్రెస్ పాలన అంతం కావాలనే ఆలోచనతోనే 2014లో ప్రజలు తెరాసను గెలిపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అలవికాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించకపోతే కాంగ్రెస్ తో సహా ఇతర నేతలు కంటివెలుగు ద్వారా పరీక్షలు చేయించుకోవాలని కేసీఆర్ అన్నారు.

కరెంట్ ఇస్తే కండువా కప్పుకుంటా అన్నా..జానా ఎక్కడ?

తెలంగాణ శాసన సభ సాక్షిగా జానారెడ్డి మాట్లాడుతూ.. 24 గంటల పాటు తెరాస ప్రభుత్వం రైతులకు కరెంటు ఇస్తే తాను సైతం గులాబీ జెండాను కప్పుకుంటా అన్నారు… ఆయనకు కరెంటు కనబడటం లేదా..? కనబడకపోతే కంటివెలుగుకి వెళ్లి చెక్ చేసుకుంటే మంచిది .. అంటూ కేసీఆర్ జానారెడ్డిని ఎద్దేవా చేశారు.

సమైఖ్యాంధ్ర పాలనలో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను అన్నప్పుడు ఈ కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోయారు… అప్పుడూ కూడా హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇతర నేతలు ఆయన వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు అంటూ గుర్తు చేశారు. ఆ తరహా గులాంగిరినే ఇప్పుడు కూడా కొనసాగించాలని కాంగ్రెస్ చూస్తోందని కేసీఆర్ విమర్శించారు.

హుస్నాబాద్ నాకు సెంటిమెంట్

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ అంటే నాకు ఎంతో సెంటిమెంట్… శ్రావణ శుక్రవారం రోజున మిమ్మల్ని ప్రసనం చేసుకోవడానికి వచ్చా…నన్ను ఆశీర్వదించండీ అంటూ కేసీఆర్ కోరగానే ప్రజలు హర్షధ్వనులు చేస్తూ జై కేసీఆర్ జై టీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్యేల అండ, మంత్రివర్గ సాయం అన్ని ఉన్నా…తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడాన్ని తట్టుకోలేక ప్రభుత్వాన్ని రద్దు చేశాను..  ఇది ఢిల్లీ పెత్తనం – తెలంగాణ ఆత్మగౌరం మధ్య పోరాటం అని కేసీఆర్ వివరించారు.

హుస్నాబాద్ ప్రజలు చైతన్య వంతులు గత పాలకుల పాలన విధానాన్ని తెరాస విధానాన్ని గమనించి నిర్ణయం తీసుకోవాలి.. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సతీష్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెరాస అధినేత కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news