వినాయక చవితి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయకచవితి కూడా ఒకటి. అయితే వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వినాయక విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ వుంటారు.
చాలామంది అలంకరణ కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎంతో అందంగా అలంకరణ చేయాలని అనుకుంటున్నారా..? మీ అలంకరణని చూసి అందరూ వావ్ అనాలని అనుకుంటున్నారా అయితే ధూప దీప నైవేద్యాలతో పాటుగా అందంగా ఇలా అలంకరణ చేస్తే ఎవరైనా వావ్ అంటారు. మరి అలంకరణ గురించి ఇప్పుడు చూద్దాం.
రంగు రంగుల కాగితాలతో అలంకరణ:
మనకి స్టేషనరీ షాపుల్లో కలర్ పేపర్స్ దొరుకుతాయి. వాటిని కొనుగోలు చేసి చక్కగా అలంకరణ చేయొచ్చు. రంగు కాగితాలతో దండలు, పువ్వులు, వాల్ హ్యాంగింగ్స్ చేయొచ్చు లేదంటే సీతాకోకచిలకలు గొడుగులు వంటివి కూడా మీరు ఆ కలర్ పేపర్స్ తో తయారు చేసి అతికిస్తే ఎంతో అందంగా ఉంటుంది. ఇలా అలంకరణ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. పైగా మీ వినాయక మండపం కూడా ఎంతో బాగుంటుంది.
దీపాలు:
నిజంగా ఎప్పుడైనా పండగ వస్తే దీపాలు ఎంతో అందాన్నిస్తాయి. ఆకర్షణీయంగా కనబడుతాయి. నూనె దీపాలను కానీ ఎలక్ట్రికల్ బల్బులు కానీ మీరు అలంకరణ కోసం వాడొచ్చు. డెకరేషన్ లైట్లని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈమధ్య ఎక్కువమంది లాంతర్లను ఉపయోగించి డెకరేషన్ చేస్తున్నారు. అలా కూడా మీరు డెకరేట్ చేయొచ్చు.
అందమైన బ్యాక్ గ్రౌండ్ వాల్:
బ్యాక్ గ్రౌండ్ వాల్ సహాయంతో మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఇది కూడా ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. ఫ్లోరోసెంట్ పేపర్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ డెకరేషన్ చేసుకోవచ్చు.
కర్టెన్స్ లేదా ఫ్లవర్ డెకరేషన్:
బ్యాక్గ్రౌండ్ కింద కర్టైన్ ని పెట్టి ఏదైనా డెకరేషన్ సామాన్లని కట్టొచ్చు లేదు అంటే ఫ్లవర్ డెకరేషన్ అయినా మీరు చేయవచ్చు. మీకు దొరికే పూలతో మీరు ఫ్లవర్ డెకరేషన్ చేస్తే అందంగా అలంకరణ పూర్తి చేసుకోవచ్చు. చూశారు కదా వినాయక చవితి నాడు ఎలాంటి డెకరేషన్స్ చేస్తే బాగుంటుంది అన్నది. మరి ఈ విధంగా అనుసరించి వినాయక చవితి నాడు ఎంతో అందంగా డెకరేషన్ ని పూర్తి చేసుకోండి.