మైనర్ బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం

-

తల్లి కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వెళ్లింది. పిల్లలను ఇంట్లోనే ఉంచింది. తల్లికి పరిచయమున్న ఓ వ్యక్తి ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లాక వారి ఇంటికి వెళ్లాడు. ఆ పిల్లల్లో పెద్ద కుమార్తెను ఏదో మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఓ అద్దె నివాసానికి తీసుకెళ్లి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి బాలికను ఆస్పత్రికి తరలించాడు. ఈనెల 28న  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 28న జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్ష రాసేందుకు బాధితురాలి తల్లి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వార్డు మెంబర్ ఆమె తొమ్మిదేళ్ల పెద్ద కుమార్తెను పట్టణంలోని ఓ అద్దె నివాసానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.

సిబ్బందికి తల్లి ఫోన్ నెంబర్​ను అందజేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆర్మూర్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news