మునుగోడు టెన్షన్..మళ్ళీ సారు ఎంట్రీ?

-

ఒకప్పుడు ఉపఎన్నికలు అంటే టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేవి…ఎందుకంటే 2004 తర్వాత నుంచి తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇక తెలంగాణ విడిపోయాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది..ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది…కానీ తొలిసారి దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో చుక్కలు చూపించింది. మళ్ళీ హుజూరాబాద్ ఉపఎన్నికలో అదిరిపోయే షాక్ ఇచ్చింది.

ఇప్పుడు మునుగోడు వంతు వచ్చింది…ఇక్కడ గెలిచి తీరాలని బీజేపీ గట్టిగా ట్రై చేస్తుంది. ఇప్పటికే బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు..అటు బీజేపీ నేతలంతా మునుగోడుపై ఫోకస్ పెట్టారు. దీంతో టీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగింది…అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న ఈ మునుగోడు ఉపఎన్నికలో గాని ఓడిపోతే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పడుతుంది.

అందుకే మునుగోడులో ఖచ్చితంగా గెలిచి తీరాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే మంత్రి జగదీశ్ రెడ్డి..మునుగోడులో తిరుగుతున్నారు. ఇటీవల కేసీఆర్ బహిరంగ సభ కూడా జరిగింది…అయితే మిగతా ఉపఎన్నికల మాదిరిగా కాకుండా…మునుగోడుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకే మరోసారి మునుగోడుకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారు. ఈ నెల రెండోవారంలో చుండూరులో పర్యటించాలని ఫిక్స్ అయ్యారు.

అలాగే ఉపఎన్నిక జరిగే సమయానికి నాలుసార్లు అయిన మునుగోడుకు వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మునుగోడుకు కేటీఆర్, హరీష్ రావులు కూడా రానున్నారు. ఒకరి తర్వాత ఒకరు మునుగోడుకు వచ్చి…సభలు సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఇప్పటికే మండలానికి ఇద్దరు నేతలని ఇంచార్జ్‌లుగా పెట్టారు. అయితే గ్రామానికి ఒకో ప్రజాప్రతినిధిని పర్యవేక్షుకునిగా నియమించాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మునుగోడుపై కేసీఆర్ ఫోకస్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి మునుగోడు..కేసీఆర్‌ని బాగానే టెన్షన్ పెడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news