ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాహీరో వైష్ణవ్‌తేజ్. రెగ్యులర్ కమర్షియల్ పంథాకు భిన్నమైన కథాంశాన్ని ఎంచుకొని హీరోగా వైవిధ్యతను చాటుకున్నాడు. ఉప్పెన తర్వాత ప్రేమకథతో వైష్ణవ్‌తేజ్ చేసిన తాజా చిత్రం రంగరంగ వైభవంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమాకు తమిళ అర్జున్‌రెడ్డి ఫేమ్ గిరీశాయ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ సినిమాతో గ్లామర్ డాల్‌గా పేరుతెచ్చుకున్న కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. ‘రంగ రంగ వైభవంగా’తో వైష్ణవ్‌తేజ్ హిట్ అందుకున్నాడా? తెలుసుకుందాం
కథ: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మాట్లాడుకోకుండా దూరంగా ఉంటారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఇద్దరు డాక్టర్లుగా కనిపిస్తారు. ఇందులో కేతిక శర్మ… రాధ, వైష్ణవ్ తేజ్.. రిషి పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత రిషి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. ఇక ఆయన పడిన ఇబ్బందిలేంటి.. ఇంతకీ చిన్నప్పుడు రాధతో ఏం గొడవ జరిగింది.. పెద్దయ్యాక కలిసారా, లేదా అనే విషయాలు సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- సినిమా కథ
- కామెడీ
- దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సాగదీత సన్నివేశాలు
- సెకండాఫ్
లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ నటన, రొమాన్స్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తంగా కథా కథనాలు సినిమాను దెబ్బతీశాయి. అవుట్ డేటెడ్ ఎమోషనల్ క్లైమాక్స్ మరొక మైనస్ గా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రంగ రంగ వైభవంగా వైష్ణవ్ కి విజయం కట్టబెట్టడం కష్టంలానే కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. శ్యామ్ దత్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక మిగతా సాంకేతిక విభాగాలు తమ పనులల్లో పూర్తి న్యాయం చేశారు.
చివరగా… ట్రైలర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు కల్పించారు. ఫస్ట్ హాఫ్ ఒకింత ఎంటర్టైనింగ్ గా నడిపిన దర్శకుడు గిరీశాయ సెకండ్ హాఫ్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. కథలో కూడా కొత్తదనం లేదు.
‘రంగ రంగ వైభవంగా’లో వైభవం లేదనే చెప్పాలి…
రేటింగ్: 2/5