ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే – విజయసాయి

-

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు యనమల రామకృష్ణుడిపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే అంటూ విజయసాయి..తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఉపాధి దొరికి యువత స్వతంత్రులవుతారన్నది టీడీపీ ఏడుపు అని… కేంద్రం వేయి కోట్ల గ్రాంట్ ఇస్తుందన్నారు.

ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించిన దుర్మార్గపు యనమల సొంత జిల్లా గొంతు కోస్తున్నాడని ఆగ్రహించారు. బల్క్ డ్రగ్ కేపిటల్ గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ కాలుష్యమయం అయిపోయిందా మలమల ? అంటూ చురకలు అంటించారు.

మహానాడుకు వచ్చిన జనం గట్టిగా చప్పట్లు కొట్టారు. అది చూసి పార్టనర్ తో పొత్తే లేదన్నారు తెలుగు తమ్ముళ్లు. పచ్చకుల మీడియా ప్రచారం వాపే తప్ప బలుపు కాదని లేటుగా గ్రహించిన చంద్రబాబు మళ్లీ పొత్తులంటూ వెంపర్లాట. పచ్చ కుల మీడియా నీకు పట్టం కట్టినా, జనం ఛీ కొడుతున్నారు బాబూ అంటూ మరో ట్వీట్‌ లో ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news