ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలు వినాయక చవితి ఉత్సవాల లో బిజీగా ఉన్నారు.గత రెండేళ్ళు కరోనా కారణంగా ఎటువంటి ఉత్సవాలు జరగలేదు. ఈ ఏడాది మాత్రం ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. జనాలు నువ్వా నేనా అన్న రీతిలో గల్లీకి ఒక వినాయకుడిని పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.. ఆగస్టు 31 న వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.. ఒక్కో ప్రాంతం లో ఒక్కో ప్రత్యేకతతో వినాయకుడి సంబరాలు జరుగుతున్నాయి.
గణనాథుడి పై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. వరంగల్ నగరంలో ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.. ఆ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.. ఆ వినాయకుడి గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
వరంగల్ వినాయక ట్రస్టు భవన్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది. 108 మంది సభ్యులు స్వామి వారి అలంకరణకు కావలసిన నగదును సేకరించి వినాయక మండపాన్ని అలంకరించారు. 16 ఏళ్ల నుంచి వీళ్లు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
అలంకరణ కోసం ఉపయోగించే కరెన్సీ నోట్ల విలువ ఏటా అంతకంతకూ పెరుగుతోంది. ఈ గణపతిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ వినాయకుడికి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ కరెన్సీ వినాయకుడి మండపాన్ని మీరు కూడా ఒకసారి చూడండి..