నేటినుండి దుబాయ్ లో భక్తులకు దర్శనమివ్వనున్న వెంకటేశ్వర స్వామి

-

దుబాయ్ లో నిర్మిస్తున్న పెద్ద, విశాలమైన హిందూ దేవాలయం శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం పూర్తయిన విషయం తెలిసిందే. నేటి నుంచి దుబాయ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్నారైలు ఆదివారం నుంచి దుబాయ్ నగరంలో దర్శనం చేసుకోవచ్చు. దుబాయ్ లోని జబల్ అలీలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయ ప్రాంగణంలో వెంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ట పూర్తయింది.

ఆగమ శాస్త్రానుసారం అత్యంత సుందరంగా నిర్మించిన ఆలయ సముదాయంలో దుబాయిలోని భక్తుల మనోభావాలకు అనుగుణంగా వివిధ దేవత మూర్తులను ప్రతిష్టించగా.. అందులో తెలుగు నాట భక్తుల పాలిట కొంగుబంగారమైన ఏడు కాసుల వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఒకటి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇస్తారు. ప్రస్తుతానికి స్వామివారికి భక్తులు ఎలాంటి ధూప దీప నైవేద్యాలు సమర్పించడానికి అవకాశం లేదు. అక్టోబర్లో దేవాలయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీంతో అక్టోబర్ 4 నుంచి భక్తులు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా నేరుగా దేవాలయాన్ని దర్శించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news