ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే మొదలైన మూడవరోజు ఒక కంటెస్టెంట్ మీద ఫైర్ అవుతూ నామినేషన్స్ వేశారు బిగ్ బాస్. సీజన్ సిక్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజియస్ట్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రేవంత్ మీద హౌస్ మేట్స్ అంతా పగబట్టారు. ఇక ఆయన రైజ్ చేస్తున్న వాయిస్ మీద పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.. నిజానికి రేవంత్ చెప్పే మాటల్లో విషయం ఉన్నప్పటికీ వాయిస్ పెద్దగా ఉండడం వల్ల ఆ విషయం వేరేలా కన్వే అవుతోందని హౌస్ మేట్స్ చెబుతున్నారు.
ఇకపోతే సీజన్ సిక్స్ లో జరిగిన డైరెక్ట్ నామినేషన్స్ లో దాదాపు 8 మంది దాకా ఉండడం అందులో రేవంత్ ని నామినేట్ చేయడం గమనార్హం. అయితే రేవంత్ నే నామినేట్ చేయడంలో హౌస్ మేట్స్ ఉద్దేశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ ఎలాగో ఫాలోయింగ్ సంపాదించుకున్న సింగర్ కాబట్టి కచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వేరే వాళ్ళకి వేస్తే ఎలిమినేట్ అవుతారేమో అన్న కారణం చేత కూడా రేవంత్ ని నామినేషన్స్ లో వేసి ఉండొచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ మాత్రం ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని ఫీల్ అయ్యే అవకాశం లేకపోలేదు.అంతేకాదు బిగ్ బాస్ సిక్స్ లో తను మంచి చెప్పాలని అనుకున్నా సరే ఇలా మ్యాటర్ రివర్స్ అవడం గురించి తనలో తాను బాధపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక మొదటి వారమే ఏ సీజన్లో లేని విధంగా ఒక్కో హౌస్మేట్స్ రెండు మూడు రకాల ప్రవర్తనలతో ఎవరికి చెప్పకుండా ఉంటున్నారు. మరి రేవంత్ తనని నామినేట్ చేసిన వారి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడో చూడాల్సింది. నిజానికి రేవంత్ కు ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు.