ఆ లోపం వల్లే మోసం పోయానని కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ నరేష్..!!

-

బుల్లితెరపై పలు కామెడీ షోలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు జబర్దస్త్ నరేష్.. చూసేందుకు చిన్న కుర్రాడిలా ఉన్నా కానీ డైలాగులు మాత్రం ఒక రేంజ్ లో పేలుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇక తనదైన శైలిలో యాక్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు సైతం నవ్విస్తూ ఉంటారు. అయితే ఈ కమెడియన్ జీవితంలో కూడా ఒక విషాదమైన గాధ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయి ఇతడిని ప్రేమించి నట్లుగా నటించి నిండా ముంచేసిందట. తన రియల్ లవ్ స్టోరీ ని ఒక పాట రూపంలో నరేష్ తెలియజేశారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో నరేష్ డ్యాన్స్ చేసి అందరిని కంటతడి పెట్టించారు. ఇప్పుడు అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే .. జడ్జ్ లుగా సదా , పూర్ణా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక హీరో సుధీర్ బాబు కూడా ఈ షో కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఎప్పటిలాగానే ఇందులో ఎంతోమంది కమెడియన్లు సైతం తమ కామెడీ టైమింగ్ తో ఎంత బాగా నవ్విస్తూ వచ్చారు. ఇక నరేష్ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక తనని ఒక అమ్మాయి మోసం చేసినా.. ఆ బాధను భరించలేక తను ఎంతో ఆవేదనకు గురయ్యాడు. ఇక ఆ బాధను ఈ డాన్స్ రూపంలో తెలియజేయడం జరిగింది.అయితే నరేష్ పొట్టిగా ఉన్నందువల్లే ఆ అమ్మాయి మోసం చేసి వెళ్లిపోయిందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

నరేష్ డ్యాన్స్ ఇందులో చాలా నేచురల్ గా చేశారని , ఈ ప్రోమో ను చూస్తే అర్థమవుతోంది. ఇక అంతే కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా నరేష్ డ్యాన్స్ ని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక నరేష్ పక్కన ఐశ్వర్య అనే అమ్మాయి డాన్స్ వేయడం జరిగింది. మరి అసలు విషయం తెలియాలి అంటే, ఈ ఎపిసోడ్ పూర్తిగా ప్రసారం కావాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news