బాలాపూర్ వినాయకుడి నిమజ్జన ఉత్సవాల్లో అస్సోమ్ సీఎం పాల్గొంటున్నారని తెలిపారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవాసమితి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు. ప్రభుత్వం చివరకు మేము కోరినట్లు ఏర్పాట్లు చేసిందని.. హిందూ బంధువులంతా ఏకమై నిమజ్జన ఉత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. వర్షం వల్ల నిమజ్జనం లేట్ అయినా.. అన్ని విగ్రహాలు వినాయక సాగర్ లొనే నిమజ్జనం చేయాలని వెల్లడించారు.
మధ్యాహ్నం 2.30 కి ఓల్డ్ సిటీ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రసంగిస్తారన్నారు. నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని.. మంత్రి తలసాని పేర్కొన్నారు. 38 వేల వినాయకుల నగరవ్యాప్తంగా ఏర్పాటు చేశారని.. మండపాల నిర్వాకులు అధికారులతో సహకరిస్తున్నారన్నారు. ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర ప్రారంభమైందని.. హైదరాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర దేశంలో గ్రాండ్ గా జరుగుతుందని తెలియజేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో నిమజ్జనం చేస్తున్నామని వివరించారు మంత్రి తలసాని.