ఏందయ్యా సామి..ఈ గుమ్మడికాయ ధర రూ.47 వేలా?

-

ప్రతి రోజూ ఏదోక ఆశ్చర్య కరమైన వార్తలను వింటూనే ఉంటాము.. సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వార్తలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కొన్ని వార్తలు జనాలను ఆశ్చర్య  పరిస్తే మరి కొన్ని మాత్రం కామెడీగా అనిపిస్తాయి. ఇప్పుడు వినబోయే వార్త కూడా అలాంటిదే..సాదారణంగా కూరగాయల ధరలు పదో,వందో ఉంటాయి. కానీ వేలు ఉండటం మనం బహుశా చూసి ఉండము.. ఓ గుమ్మడి కాయ ధర అక్షరాల 47 వేలు ఉంది.. ఆ కాయను కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుండటం విశేషం..

తాజాగా ఓ గుమ్మడికాయ రూ.47వేలు ధర పలికి స్థానికులను ఆశ్చర్య పరిచింది. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా.. ఒక గుమ్మడికాయ ఆ ధర పలకడమేమిటి.. మీ పిచ్చికాకపోతే.. అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.ఆ గుమ్మడి కాయ బరువు సుమారు 5 కేజీలు. అయితే ఏంటి గొప్ప అని అనుకోకండి, దానికి పెద్ద స్టోరీ వుంది. అది ధర రూ.47 వేలు.. ఆ గుమ్మడికాయ స్టోరీ విషయానికొస్తే.. కేరళ ఇడుక్కిలో చెమ్మన్నార్​ గ్రామం ఒకటి వుంది. అది పూర్తిగా కొండ ప్రాంతంలో ఉంది. అయితే ఇపుడు అక్కడ ఓనం సంబరాలు నడుస్తున్నాయి కదా. పండగ సందర్భంగా నిర్వహించిన బహిరంగ వేలంలో 5కిలోల గుమ్మడికాయ భారీ ధర పలికింది.

అక్షరాల నిజమనే చెప్పాలి.. ఆ గుమ్మడికాయని ఏకంగా రూ.47 వేలకు వేలం పాడాడు సదరు వ్యక్తి. సాధారణంగా ఓనం పండగ సమయంలో నిర్వహించే వేలంలో పొట్టేలు, కోళ్లు వేల రూపాయలు పలకడం చాలా సాధారణమైన విషయం. అయితే ఈ సారి వేలంలో మాత్రం గుమ్మడికాయ భారీ ధర పలకడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ గుమ్మడికాయను వేలం నిర్వాహకులకు ఎవరో ఉచితంగా ఇచ్చారట..అది అంత ధరకు అమ్మడు పోయింది. ఏది ఏమైనా కూడా ఈ గుమ్మడి కాయ ధర మాత్రం అందరినీ నోరువెళ్ళబెట్టేలా చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news