రాహుల్ గాంధీ ముందు దేశ చరిత్రను అధ్యయనం చేయాలి – అమిత్ షా

-

భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. రాజస్థాన్ లోని జోద్పూర్ లో ఓ పార్టీ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడానికంటే ముందుగా దేశ చరిత్రను అధ్యయనం చేయవలసిన అవసరం ఉందన్నారు. విదేశీ బ్రాండ్ టీషర్టు ధరించి భారత్ జోడో యాత్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు.

గతంలో పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని గుర్తుచేయాలనుకుంటున్నాను అంటూ భారత్ ను అసలు దేశమే కాదని రాహుల్ వ్యాఖ్యానించారని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఏ పుస్తకంలో చదివారు? పని ప్రశ్నించారు. ఇది ఒక దేశం.. దీనికోసం లక్షలాదిమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు అమిత్ షా. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసేందుకు వెళ్లారు కానీ, అంతకుముందు ఆయన దేశ చరిత్రను అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని విమర్శించారు. అభివృద్ధి కోసం కాదని.. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news