ఫ్యామిలీకి దూరంగా మంచు హీరో ?

-

మంచు మ‌నోజ్ కు సినిమా అవ‌కాశాలు రాని సంగ‌తి తెలిసిందే. అత‌ను సినిమాలు చేసి రెండేళ్లు అవుతుంది. దీంతో మ‌నోజ్ కూడా సినిమాల‌పై దాదాపు ఆశ‌లు చంపుకున్నాడు. అందుకే ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌డం లేదు. రాజ‌కీయాల‌లోకి వెళ్లాని ఆశ ఉంది కానీ, మోహ‌న్ బాబు ఏమంటాడా? అని బెదురుతున్నాడు. ఎపీలో ఎన్నిక‌ల స‌మయంలో జ‌న‌సేన పార్టీకి ఫుల్ స‌పోర్ట్ చేసాడు. మోహ‌న్ బాబు వైకాపాని వెన‌కేసుకొస్తే..మ‌నోజ్ జ‌న‌సేన‌కు మ‌ద్దతుగా మాట్లాడారు. ప‌వ‌న్ , జ‌గ‌న్ లో ఎవ‌రో ఒక‌రు సిఎం కావాలి త‌ప్ప చంద్ర‌బాబు మాత్రం కూకూడ‌ద‌ని బ‌లంగా దేవుడ్ని కోరుకున్న వారిలో తండ్రీ కోడుకులున్నారు. అయితే తాజాగా మ‌నోజ్ గురించి ఓ షాకింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Manchu hero is far away from family

కొన్ని నెల‌లుగా మ‌నోజ్ కుటుంబానికి, భార్య‌గా దూరంగా ఉన్న‌ట్లు ఓ వార్త వినిపిస్తోంది. త‌మ ఫ్యామీలి ఫంక్ష‌న్ల‌ల‌లో సైతం ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని, కేవ‌లం మ‌నోజ్ భార్య మాత్ర‌మే హాజ‌ర‌వుతోందిట‌. ప్ర‌స్తుతం శంషాబాద్ ద‌గ్గ‌ర్లోని కొత్త ఇంట్లో ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో అక్క‌డ‌కు కూడా వెళ్ల లేదట‌. తండ్రితో చిన్న‌పాటి విబేధాలు కార‌ణంగా వెళ్ల‌లేద‌న్న రూమ‌ర్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో భార్య‌తోనూ స‌మ‌స్య‌లు త‌లెత్తాయా? అనుమానం ఇప్పుడు చాలా మందిలో మొద‌లైంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఆ ర‌క‌మైన క‌థ‌నాలు వైల‌ర్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం మ‌నోజ్ చిత్తూరు జిల్లాలో ఉన్న త‌మ స్కూల్ లో ఉన్న‌ట్లు తెలిసింది.

స్కూల్ కు సంబంధించిన ప‌నుల్లోనే కొన్ని నెల‌లు గా నిమ‌గ్న‌మైన‌ట్లు ఈ సంద‌ర్భంగా కొంత మంది స‌న్నిహితుల ద్వారా కూడా తెలిసింది. స్కూల్ ప‌నులు అనంత‌రం అక్క‌డ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడుట‌. ఇటీవ‌లే మంచు విష్ణు కూడా అక్క‌డికి వెళ్లిన‌ట్లు స‌మాచారం. కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో కూడా మ‌నోజ్ ట‌చ్ లో లేని సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ రూమ‌ర్ల‌న్నింటిపై మ‌నోజ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news