వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు..నన్ను కూడా చంపగలరంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కు టీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై వైఎస్ షర్మిల ఇవాళ మీడియాతో మాట్లాడారు. మరదలు అని అసభ్యకర పదజాలం తో దోషిస్తే కేసు పెట్టడం లేదని.. నా ఆత్మాభిమానం దెబ్బ తీస్తున్నారని ఆగ్రహించారు.
నన్ను మరదలు అంటే నేను పట్టించుకోకుండా ఉండాలా..? అని ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణలో మహిళల మీద గౌరవమని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రుల మీద కేసులు వేయకూడదా…? మంత్రుల మీద కేసులు వేయరా..? మేము మంత్రుల మీద కేసులు నమోదు చేయం అని..డైరెక్ట్ గా చెప్పండని నిప్పులు చెరిగారు.
నేను వైఎస్సార్ బిడ్డ అయి ఉండి కూడా కేసు పెడితే నమోదు చేయడం లేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఎంటి..? అని ఆగ్రహించారు. ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమేనని..తెలంగాణలో ప్రజా స్వామ్యమే లేదని ఆగ్రహించారు. ఒకడు మరదలు అంటాడు…ఒకడేమో వ్రతాలు అంటాడు.. పోలీస్ శాఖ ను తెరాస లో విలీనం చేయండని చురకలు అంటించారు వైఎస్ షర్మిల.