చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన చాలా లాభాలు ఉంటాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా ఈ స్కీమ్స్ వలన మంచిగా డబ్బులు వస్తాయి. అలానే చిన్న మొత్తం నగదును కూడా వాయిదాల రూపంలో పే చెయ్యచ్చు.
ఇక ఇది ఇలా ఉంటే పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించి మార్పులు చేయడం జరిగింది. అకౌంట్ నుంచి క్యాష్ విత్‌డ్రాకు సంబంధించి కొన్ని రూల్స్ వచ్చాయి. ఇక వాటి కోసం చూస్తే.. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 10 వేలు లేదా అంతకంటే అమౌంట్ ని తీసుకోవాలనుకుంటే గుర్తింపు ధ్రువీకరణ అవసరం.
ఇతరులు వెళ్లి తీసుకోవడం కుదరదు. ఈ విషయాన్ని సమాచార మంత్రిత్వ శాఖ చెప్పింది. క్యాష్ విత్‌డ్రా చేసేటప్పుడు మోసాలు ఏవి ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. మోసాలను మొదట్లోనే ఆపేందుకు సర్కిల్ హెడ్స్ దీనిని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలంది. పోస్ట్ ఆఫీస్ లో చాలా స్కీమ్స్ వున్నాయి. ఈ స్కీమ్స్ తో ఎంతగానో లాభం పొందొచ్చు.
కనీసం రూ. 500 నుండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 4 శాతం వడ్డీ రేటును పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా అందుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తక్కువ అమౌంట్ ని సేవ్ చెయ్యాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ బెస్ట్.