బిహార్ లో ప్రశాంత్ కిశోర్ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర

-

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.  ఈ క్రమంలోనే ‘జన్‌ సూరజ్‌’ పేరుతో 3500కి.మీ మేర పాదయాత్ర ప్రారంభించారు. గాంధీ జయంతి  సందర్భంగా బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అని చెబుతున్నా, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మహాత్మాగాంధీ 1917లో మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భీతిహర్వా గాంధీ ఆశ్రమ్‌ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర ద్వారా బిహార్‌లోని ప్రతి పంచాయతీ, బ్లాక్‌ను పర్యటించాలని ప్రశాంత్‌ కిశోర్‌, ఆయన మద్దతుదారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, ఈ యాత్ర పూర్తికావడానికి సుమారు 12 నుంచి 15 నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

అత్యంత పేద, బలహీన రాష్ట్రంగా ఉన్న బిహార్‌ రూపురేఖలను మార్చాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో భాగంగా ఈ పాదయాత్ర తొలి అడుగు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news