వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి..? రక్తప్రసరణ దెబ్బతింటే సమస్య తప్పదుగా..

-

మనం బహిర్గతంగా ఎన్నో పనులు చేస్తుంటాం.. ఖాళీగా ఉన్నప్పుడు రెస్ట్‌ తీసుకుంటాం.. కానీ బాడీ లోపల అలా కాదు.. 24గంటలు ఆగని ఇంజన్‌లా పని జరుగుతూనే ఉంటుంది. ఏ అవయువం పని అది చేసుకుంటూ ఉంటుంది. వీక్‌ఆఫ్‌లు లేకుండా మన ఆరోగ్యం కోసం ఎన్న అవయవాలు కష్టపడుతున్నాయి. వీటిల్లో ప్రాధనమైనది రక్తం.. అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేయాలి..! గుండె పంపింగ్ చేసే రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. ఆక్సిజన్, ఇతర పోషకాలను ఆయా భాగాలు గ్రహించుకున్న తరువాత సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకెళ్తాయి.. ఈ ప్రక్రియ సాఫీగా సాగినంత కాలం ఏ ప్రాబ్లమ్‌ ఉండదు. అయితే కొంత మందిలో సిరల్లో సామర్ధ్యం తగ్గటం కారణంగా రక్తం తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. సిరల్లోని కవాటలు బలహీనం కావటమే దీనికి కారణం. దీని వల్ల కాలి సిరలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. దీనిని వెరికోస్ వెయిన్స్ అంటారు.

రక్తప్రసరణ దెబ్బతినటం వల్ల మడమల నొప్పులు, వాపు , దురద, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా రావటానికి అనేక అంశాలు కారణంగా చెప్పవచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. పురుషుల కన్నా ఈ సమస్య స్త్రీలలోనే అధికంగా ఉంటుందట. అధిక బరువు ఉన్నవారు ఎక్కువ సేపు నిలబడటం వల్ల వెరికోస్ వెయిన్స్ దారితీసే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.. కదలకుండా పనులు చేసే వారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారు సరైన చికిత్స తీసుకోకుంటే సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల అది తీవ్రమైన సమస్యకు దారి తీస్తుందట.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

సిరలు ఉబ్బిన వారు కాళ్ల కింద ఎత్తుగా దిండు పెట్టుకుని నిద్రించాలి.
సాక్సులు, పట్టీలు ధరించటం మంచిది.
రక్త ప్రసరణ దెబ్బతినకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటే సిరలు ఉబ్బకుండా చూసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
పీచుతో కూడిన ఆహార పదార్ధాలను ఎక్కకువగా తీసుకోవాలి.
ఆహారంలో ఉప్పును తగ్గించాలి.
కూర్చుని ఉన్న సమయంలో కాళ్లను కాస్త ఎత్తులో పెట్టుకోవాలి.
గంటల కొద్దీ ఒకే భంగిమలో కూర్చోవటం, నిల్చోవటం చేయకుండా మధ్యమద్యలో భంగిమలు మార్చాలి.
సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదిస్తే వెంటనే తగిన చికిత్స మొదలుపెట్టుకోవచ్చు..
బాడీలో రొటీన్‌కు భిన్నంగా ఏం జరిగినా అది భవిష్యత్తులో వచ్చే ఏదో రోగానికి సంకేతంగానే భావించాలి. ఏమైందిలే బానే ఉంది కదా..అప్పుడప్పుడే ఇలా జరుగుతుంది అని లైట్‌ తీసుకోకుండా వ్యాధి ముదరకుముందే వైద్యులను సంప్రదించడం మేలు.!

-Triveni Buskarowthu 

Read more RELATED
Recommended to you

Latest news