సిరిమానోత్సవానికి భారీగా బందోబస్తు.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తాం : ఎస్పీ దీపికా

-

ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఈ సారి భారీగా బందోబస్తో ఏర్పాచేస్తున్నామని విజయనగరం ఎస్పీ ఎం దీపికా పాటిల్‌ వెల్లడించారు. ఈ నెల తొమ్మిది, పది, పదకొండు తేదీలలో నగరం అంతటా పోలీసుల గస్తీ ఉంటుంది. ఈసారి ఈ నెల తొమ్మిదిన కన్యకా పరమేశ్వరీ ఆలయం నుంచి ఆనంద్ గజపతి ఆడిటోరియం వరకూ పది వేల మందితో ర్యాలీ నిర్వహిస్తున్నారు… ఇందుకోసం ఏలాంటి ఇంబ్బందు లేకుండా ప్రత్యేక చ్యలు.. ఉత్సవాల కోసం మూడు వేల మంది పోలీసులను వినియోగిస్తున్నాం… సిరిమానోత్సవం చూడడానికి ఎనిమిది రోడ్లలో ప్రజలు నిలుచోవటం జరుగుతుంది…

Deepika Patil IPS about Disha ACT || DGP Gautam Sawang || CM YS Jagan ||  Bezawada Media - YouTube

తొక్కిసలాట జరగకూడదని ఈ సారి రోడ్లను బాక్స్ గా విభజించి అందులో ఉండి తిలకించేలా చర్యలు తీసుకుంటున్నాం.. 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తాం.. క్రైమ్ టీమ్స్ అధికసంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాం.. అయోధ్య మైదానం లో 10న మ్యూజికల్ నైట్ ఉంది.. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాం.. పిల్లలు, వృద్ధుల దర్శనం కోసం ప్రత్యేక సేవాదళ్ ఏర్పాటు చేస్తున్నాం… పదహారు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ కోసం నిర్దేశించడం జరిగిందని ఆమె వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news