మనం తినే ఆహారాన్ని బట్టే మన హెల్త్ ఉంటుంది. ఎప్పుడూ ఒకే తీరు ఉండేవి తింటే బాడీ వాటికి అలవాటై పోయి కొత్త వాటిని గ్రహించలేదు. శరీరానికి అన్ని రుచులు అందించాలి. శాకాహారం, మాంసాహారం రెండూ తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ కొందరు ఏదైనా ఒక్కటి మాత్రమే తింటారు. కేవలం శాకాహారం తినే వారు డిప్రషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తాజాగా జరిగిన పరిశోధనలో తేలింది.
బ్రెజిల్లో జరిగిన ఈ పరిశోధన వివరాలను జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించారు. దాని ప్రకారం.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మాత్రమే తినే శాకాహారులు త్వరగా నిరాశ ,నిస్పృహ బారిన పడతారని తేలింది. ఈ పరిశోధనలో ఆహారంలోని కేలరీలు, ప్రొటీన్లు, మైక్రో న్యూట్రియెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిలు వంటి పోషకాలనింటిని పరిగణనలోకి తీసుకుంది.
కారణం ఏంటి..?
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. డిప్రెషన్ బారిన పడిన వారిలో ప్రతికూల ఆలోచనలు అధికంగా ఉంటాయి. శాకాహారంలో సరైన పోషకాలు అందకపోయినా కూడా ఇలాంటి నిరాశ కలిగే అవకాశం ఉంటుందట…మాంసాహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కోలిన్, విటమిన్ బి6, బి12, ఫోలేట్, కొన్ని ప్రత్యేకమైన అమైనో ఆమ్లాలు, సెరోటోనిన్, డోపమైన్, నోర్‌ఫైన్‌ఫ్రైన్ వంటివి లబిస్తాయి. ఇవి మానసిక స్థితికి చాలా అత్యవసరం.
ఇక సెరోటోనిన్, డోపమైన్, నోర్‌ఫైన్‌ఫ్రైన్ టివి మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్ మీటర్లు. ఇవన్నీ మాంసాహారంలో పుష్కలంగా దొరుకుతాయి. డొపమైన్, సెరోటోనిన్ అనేవి హ్యాపీ హార్మోన్స్.. తినే ఆహారంలో ఇవి ఉంటే.. మనిషి సంతోషంగా ఉంటాడట.. కూరగాయల్లో చిక్కుడు కాయలో ఇవి బాగా ఉంటాయి..కానీ శాకాహారులకు ఈ పోషకాలేవీ తమ ఆహారం ద్వారా సరిపడినంత శరీరంలో చేరవు. అందుకే వారు డిప్రెషన్ బారిన పడే అవకాశం అధికం.
కాబట్టి.. అవకాశం లేని వారి సంగతి పక్కనపెడితే.. మీకు అలవాటు ఉండి కూడా.. ఎప్పుడో ఒకసారి అన్నట్లు కాకుండా.. వారానికి ఒకటి రెండుసార్లు లాగించేయండి..అయినా నాన్‌వెజ్‌లో ఉండే కిక్కే వేరు కదా..!