నల్లగొండ జిల్లా మునుగోడులో జనసమితి అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జనసమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. పైసలను చూడకుండా ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవారికి మద్దతు ఇవ్వాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసమితి పోటీలో ఉందని, తెలంగాణతో టీఆర్ఎస్ సంబంధాలు తెంపేసుకుందని, తెలంగాణ ఆకాంక్షల కోసం ప్రయత్నం జరగాలన్నారు కోదండరాం. అంతేకాకుండా.. ‘కేసీఆర్ జాతీయ స్థాయిలో గెలుస్తారని ఆయనకి కూడా నమ్మకం లేదు. తమ స్వంత ప్రయోజనాలు తప్పా కేసీఆర్ ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదు.
చేనేతపై జీఎస్టీ రద్దు కోసం టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం లేదు. భూ నిర్వాసితులు నామినేషన్ వేస్తుంటే వాళ్ళని అడ్డుకున్నారు. ప్రజల తరఫున మాట్లాడాల్సిన అవసరం. ఈ ఎన్నికల్లో ప్రజలు పక్కకి వెళ్లి పైసలు ప్రధానమైంది. కాంట్రాక్టుల కోసమే ఈ ఎన్నికలు వచ్చాయి. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని రాజ్ గోపాల్ పోరాడితే ప్రజలు నమ్మేవారు. రాజ్ గోపాల్ తన ప్రయోజనాల కోసం ఈ ఎన్నికలు’ కోదండరాం ఆరోపించారు.