టీబీని అంతం చేయటానికి సమాజంలోని అన్ని వర్గాలు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. ఆ బాధ్యత టీబీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణపై ఇంకింత ఎక్కువుందన్నారు. 2025 కల్లా మన దేశాన్ని టీబీ ముక్త్ భారత్ గా చేయాలన్నారు గవర్నర్ తమిళిసై. రాష్ట్రంలో 28 వేల మంది టీబీ రోగులున్నారని..25 వేల మంది దత్తత తీసుకోవాలన్నది తమ ఆకాంక్ష అని అన్నారు గవర్నర్ తమిళిసై.
ఈ సందర్భంగా 100 మంది పేద టీబీ రోగులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు గవర్నర్ తమిళిసై. విచక్షణ గ్రాంట్ల నుంచి రూ.15 వేలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వాళ్లకు 6 నెలలు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తామని గవర్నర్ తమిళిసై చెప్పారు. రాజ్ భవన్ ఉద్యోగులు, అధికారులు మరో 10 మందిని దత్తత తీసుకున్నారు. ఇంకింత మందిని దత్తత తీసుకునేందుకు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.