హోటల్లో గిన్నెలు కడుగుతూ జీవనాన్ని కొనసాగించిన టాలీవుడ్ నటుడు..!

-

సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఏదో ఒక సందర్భంలో తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక పని చేస్తూ జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ నటుడు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బు కోసం హోటల్లో గిన్నెలు కడిగి, జీవనాన్ని కొనసాగించారట. ఇక ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు అజయ్. అజయ్ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా తదితర పాత్రలో నటించి మెప్పించారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న అందరి అగ్ర హీరోలు సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి, తన కెరియర్ గురించి అసలు విషయాలు తెలియజేశారు.

అజయ్ మాట్లాడుతూ.. పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకున్నాను.. గడిచిన 22 సంవత్సరాలుగా ఇదే చేస్తూ వచ్చాను. ఇక సినిమాలలో మన పాత్ర ఎంతసేపు ఉంది ?ఎన్నిసార్లు కనిపించింది? అని కాకుండా ఎంత ప్రభావంతంగా ఉంది ?అని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాను అని కూడా తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించగా.. నా క్యారెక్టర్ కి తగ్గట్టుగా పాత్ర లభించలేదు అందుకే నటించలేదు అని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి నేపాల్ వెళ్లిపోయారట.

ఇక అక్కడి నుంచి తిరిగి ఇండియాకు రావడానికి డబ్బుల్లేక ఒక హోటల్లో చేరి అక్కడ గిన్నెలు కడిగి డబ్బులు వచ్చాకే ఇంటికి వచ్చాను అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు. ఇక ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి నా కెరియర్ ను మలుపు తిప్పుకోగలిగాను ఇక ఎప్పటికైనా సరే నా పాత్రకు ప్రాధాన్యత ఉంది అంటేనే ఆ సినిమాలో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చారు అజయ్.

Read more RELATED
Recommended to you

Latest news