Breaking : కేటీఆర్‌ హామీతో మనుగోడు పోటీ నుంచి తప్పుకు 10 మంది ఇండిపెండెంట్లు

-

మునుగోడు ఉప ఎన్నిక వాడివేడిగా సాగుతోంది. అయితే.. ఇప్పటికే ఈ ఉప ఎన్నికలో 100కు పైగా ఇండిపెండెంట్లు నామిననేషన్లు వేశారు. అయితే.. రేపటి వరకు విత్‌ డ్రా సమయం ఉంది. ఉన్నట్టుండి.. మునుగోడు పోటీ నుంచి 10 మంది ఇండిపెండెంట్లు విరమించుకున్నట్లు ప్రకటించారు. వాళ్లంతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. కేటీఆర్ లతో కలిపించి వారికి తగిన గుర్తింపు గౌరవం దక్కేలా చూస్తామని హామీ మేరకు వారు తమ నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Munugode Bypoll: మునుగోడు నగారా మోగింది.. ఎవరి వ్యూహం వారిదే! - NTV Telugu

పోటీ నుంచి విరమించుకున్న అభ్యర్థుల వివరాలు

1. కేయూ జేఏసీ అధ్యక్షులు నీట్ వరంగల్ విద్యార్థి కౌన్సిల్ అధ్యక్షులు ఆంగోత్ వినోద్ కుమార్,

2. వార్డ్ మెంబర్ భూక్య సారయ్య,

3. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాలోత్ వెంకన్న,

4. ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి తేజావత్ రవీందర్,

5. గిరిజన రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ నరేందర్,

6. నిరుద్యోగ జేఏసీ కేయూ ఇన్చార్జి భూక్య బాలాజీ,

7. ప్రజాసేన పార్టీ అధ్యక్షులు బానోతు ప్రేమ్ లాల్,

8. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను భరత్,

9. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను తిరుపతి

10. చందర్ విద్యార్ది నాయకులు

Read more RELATED
Recommended to you

Latest news