ఏం చిన్న దొరా…మునుగోడు తెలంగాణలో లేదా ? అని కేటీఆర్ పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. ఉప ఎన్నికలో ఓట్లు వేస్తే కేటీఆర్‌కు మునుగోడును దత్తత తీసుకుంటున్నాడట. అంతకుముందు మునుగోడు తెలంగాణలో లేదా ? అని ఆగ్రహించారు. మునుగోడు మీ కంటికి కనిపించలేదా? మునుపటి ఎన్నికల్లో దత్తత తీసుకున్న కొడంగల్ కు నీవు చేసిందేంటి?ఓట్లు కావాల్సి వచ్చినప్పుడే మీకు అభివృద్ధి గుర్తుకొస్తుందా? అని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ సారు వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి, ఓట్లు తన్నుకుపోయాడు. దొంగ హామీలు ఇచ్చి చెరుకు రైతులు, ఉద్యోగులను నిండా ముంచాడు. కేసీఆర్ మాట మీద నిలబడే మనిషే అయితే షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ఆడబిడ్డలపై ఆర్థిక భారం గురించి ఈయన మాట్లాడుతుంటే వింతగా ఉంది. మీరు RTC ధరలు పెంచితే సామాన్యుడిపై భారం పడదా? మీరు కరెంట్ చార్జీలు పెంచితే సామాన్యుడిపై భారం పడదా? అని నిలదీశారు.