ఆ స్టార్ హీరోలతో అల్లు అరవింద్ మల్టీస్టారర్..!

-

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మల్టీస్టారర్లు వచ్చాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రత్యేకంగా కొందరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి కాంబినేషన్ లో ముందుగా ఉండేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో. ఈ ఇద్దరు ప్యాన్ ఇండియాలో ఇప్పుడు సూపర్ స్టార్స్. ఈ ఇద్దరితో కలిసి ఓ సినిమా చేయాలంటే అటు అల్లు అర్జున్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచాలి. ఇది దర్శకులకు చాలా కష్టం. అందుకే ఇలాంటి క్రేజీ కాంబోని ట్రై చేయడానికి చాలా వరకు ఎవరూ ముందుకు రారు.

కానీ స్వయంగా ఓ ప్రొడ్యూసర్.. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఈ కాంబో చూడాలనుకుంటే..ఈ కాంబోలో ఓ సినిమా తీయాలనుకుంటే.. ఇక ఫ్యాన్స్ కి పండగే. ఇటీవలే ఓ టాక్‌ షోలో బన్నీ, చరణ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని కోరిక ఉందని చెప్పారు అల్లు అరవింద్. అంతే కాకుండా పదేళ్ల క్రితమే ‘చరణ్‌-అర్జున్‌’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేసినట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఆ టైటిల్‌ను రెన్యూవల్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో చరణ్, బన్నీ కలిసి ఎవడు అనే సినిమా చేశారు. అయితే అందులో బన్నీ కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news