టీడీపీ కలవని ,పొత్తు పెట్టుకొని పార్టీ అంటూ లేదు : మంత్రి బుగ్గన

-

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. వ్యాపార సంబంధించి ఏపి ట్రేడ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో పలు అంశాలు పై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లో ఏపి నెంబర్ వన్ స్థానం లో ఉందన్నారు. 2019 లో ఎగుమతుల్లో ఏపి 7 స్థానం ప్రస్తుతం 4 వ స్థానం లో ఉన్నామని, ఏపి వాణిజ్య వ్యవస్థలో పునర్ వ్యస్థీకరణ చేశామన్నారు. విపక్షలకు చెందిన మీడియా ఎప్పుడు అసత్యాలను ప్రచారం చేస్తోందని, భారత దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం గా ఏపీ నిలుస్తోందన్నారు. 12 వేల కోట్లు నుంచి 13 వేల 500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి అసెంబ్లీ సాక్షిగా చెప్పామని, అప్పులు ఏనాడు దాచలేదన్న మంత్రి బుగ్గన.. కాగ్, ఆర్బీఐ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజాలు తెలుసుకోవాలన్నారు.

Kurnool: Finance Minister Buggana Rajendranath Reddy slams Naidu, questions  silence

టీడీపీ కలవని, పొత్తు పెట్టుకొని పార్టీ అంటూ లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ తో తప్ప అన్ని పార్టీలు తో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. 2014 నుంచి అసెంబ్లీ లో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు, వాడిన భాష రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసునని, చంద్రబాబు జనసేన మధ్య ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు అయ్యాయి, విడాకులు అయ్యాయని, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఓపిక ఉండాలి, పవన్ కళ్యాణ్ వాఖ్యలు సరికావని ఆయన హితవు పలికారు. మూడు రాజదానులు మూడు ప్రాంతాలు అభవృద్ధి సాధించాలని, ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల అసమానతలు వచ్చాయి, వీటిని తొలగించడానికే అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news