మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ ఎన్నో వాటికి అవసరం. స్కీమ్స్ ఓపెన్ చేయడం మొదలు ఎన్నింటికో అవసరం అవుతుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఉచితంగా ఆధార్ కార్డు ని తీసుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ ఉండాలి.
ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… UIDAI డేటా బేస్ నుంచి ఆధార్ కార్డుని అప్డేట్ చేయడం ముఖ్యం. వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నంబరు వంటి డీటెయిల్స్ ని అప్డేట్ చెయ్యాల్సి వుంది. అయితే మన ఆధార్ డీటెయిల్స్ UIDAI వెబ్‌సైట్‌లో వుండే డీటెయిల్స్ ఒకేలా ఉండేలా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక డీటెయిల్స్ ఒకేలా లేకపోతే కార్డును రద్దు చేసే అధికారం ఉంటుంది.
కనుక ఇలాంటి విషయాలను జాగ్రత్తగా చూసుకోండి. ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ సంస్థ దృష్టి పెడుతోంది. తప్పుగా జనరేట్ అయిన లక్షల కొద్ది ఆధార్ కార్డులను రద్దు చేసింది. కనుక ఆధార్‌ను వెరిఫై చేయలేదంటే యాక్టివ్‌లో ఉందా లేదా అనే విషయం తెలియదు కాబట్టే ఈ పని పూర్తిచేయాలి.
దీని కోసం మొదట www.uidai.gov.in కు వెళ్లాల్సి ఉంటుంది.
ఆ తరవాత మీరు verify Aadhaar number ను నొక్కండి. ఓ కొత్త పేజీ వస్తుంది.
ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసేయండి.
ఆ తరవాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
మీ ఆధార్ నంబరు సరైనదే అయితే వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.
మిగిలిన వివరాలు అక్కడ ఉంటాయి.
మీ వయసు, రాష్ట్రం, మీ మొబైల్ నంబరు చివరి మూడు అంకెలు వస్తాయి. ఇలా మీ ఆధార్ వెరిఫైని తెలుసుకోవచ్చు.