మునుగోడులో ప్రతిచోటా బీజేపీకి నిరసనే ఎదురవుతోంది : బాల్క సుమన్  

-

మునుగోడు నియోజకవర్గంలో ప్రతిచోటా బీజేపీకి నిరసన ఎదురవుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ప్రజలు రాజగోపాల్‌ రెడ్డిని ఓడించడం ఖాయమని అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు రాజగోపాల్ రెడ్డిని నిలదీస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో బీజేపీ డబ్బులు ఏరులై పారిస్తోందని ఆరోపించారు.

చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి బాల్క సుమన్‌ ప్రచారం నిర్వహించారు. మునుగోడులో బీజేపీకి స్పందన కరవైందన్నారు. దర్యాప్తు సంస్థలను కూడా బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కుట్ర పన్ని కారు గుర్తు పోలిన గుర్తును ఈవీఎంలో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణపై బీజేపీ కక్ష సాధిస్తోందని బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యమ సందర్భంగా తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా కిషన్‌రెడ్డి పారిపోయాడని విమర్శించారు. కేంద్రంలో 16 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా మోదీ ప్రభుత్వం.. ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని చెప్పారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news