మునుగోడు ఉప ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో.. బీజేపీ పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. మునుగోడులో కీలక నేతగా ఉన్న బూర నర్సయ్యను లాగేసుకుని.. టీఆర్‌ఎస్ కు దెబ్బకొట్టింది బీజేపీ. అయితే.. బూర నర్సయ్య పార్టీ మారిన మరుసటి రోజు నుంచే.. టీఆర్‌ఎస్ లోకి బడా లీడర్లు వెళ్లడం మొదలు పెట్టారు. ముఖ్యంగా నిన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.
గత కొంత కాలంగా బీజేపీ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్..నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇవాళ దాసోజు శ్రవణ్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌కి రాజీనామా లేఖ పంపిన దాసోజు.. టీఆర్ఎస్‌లో చేరనున్నారు.
ఇవాళ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లోకి రానున్నారు శ్రవణ్. అంతేకాదు.. దాసోజు శ్రవణ్.. బాటలోనే స్వామిగౌడ్ కూడా రానున్నారని సమాచారం. బీజేపీ ఎప్పుడూ చెప్పుకునే RRR… లోని ఒక R కూడా ఎగిరిపోనుందట. అయితే.. ఆ R ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. రఘునందన్ రావు.. టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళతారని.. కేసీఆర్ సన్నిహితంగా ఉండేది అతడు ఒక్కడేనని అందరూ అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి కల్లా.. ఆ R కూడా టీఆర్‌ఎస్ లోకి వెళ్లనుందని టాక్.
అతి తొందర్లోనే 'RRR'లో ఒక 'R' పీకనుంది..!
— Journalist Shankar (@shankar_journo) October 21, 2022
Which R of the RRR pic.twitter.com/7rBRYClTsY
— #TelanganaWithBRS⛳ (@RameshHTI) October 21, 2022