అమరావతి రైతులను చూస్తేనే సీఎం జగన్ కు భయం వేస్తుంది – బోండా ఉమ

-

పాదయాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు అమరావతి రైతులు ప్రకటించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్నవారు గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులుు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ విషయంపై టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ స్పందించారు. రైతులను చూస్తేనే సీఎం జగన్ కు భయం వేస్తోందన్నారు.

అమరావతి పాదయాత్రతో వైసీపీలో వణుకు పుట్టిందని అన్నారు. అందుకే అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా పాదయాత్ర జరుగుతుంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు శాంతియుతంగా జరగలేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర శాంతియుతంగా జరగడం లేదా? తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను పాటించే ప్రతి పోలీసు అధికారిని టిడిపి వదిలిపెట్టదని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించరా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news