నన్ను ఎవరూ ఆపోద్దు..నేనే కాబోయే తెలంగాణ సీఎం – కేఏ పాల్

-

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార హోరుతో దూసుకెళ్తున్నాయి. అయితే ఓటర్లను మరింత ఆకర్షించేందుకు ప్రచార వ్యూహాన్ని మార్చాలంటూ రాష్ట్ర నేతలకు బిజెపి అధిష్టానం ఆదేశాలు పంపింది. నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ ఒకటవ తేదీ సాయంత్రం లోపే ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ హల్‌ చల్‌ చేశారు.

నన్ను ఎవరూ ఆపోద్దు..నేనే కాబోయే తెలంగాణ సీఎం అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరు లో కేఏ పాల్ రెచ్చిపోయారు. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్ అంటూ… విధుల్లో ఉన్న ఓ అధికారి పై తన ప్రతాపం చూపాడు. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు.

కాగా కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచార నిర్వహిస్తుండగా, వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కే ఏ పాల్ స్పందిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్నా.. నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రినీ రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారినీ నీ పేరు ఎంటంటూ అధికారి మెడలోని ఐడి కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు.. కె ఏ పాల్ కు సర్ది చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news