నేడు మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నదికి ఈ సీజన్ లో పెద్ద ఎత్తున వరద వచ్చిందని చెప్పారు. దీంతో లోయర్ కాపర్ డ్యాం పనులు కుంటుపడ్డాయని, వరద తగ్గాక మళ్ళీ పనులు తిరిగి మొదలు పెడతామని తెలిపారు. టిడిపి హయాంలో అప్పర్, లోయర్ కాపర్ డ్యాములు నిర్మించకుండా.. డయాఫ్రం వాల్ నిర్మించి చారిత్రక తప్పు చేశారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
మూడుసార్లు వరదల కారణంగా లోయర్ కాపర్ డ్యాం పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామన్నారు. పనులు ఆలస్యం కావడం మాత్రం బాధ కలిగిస్తుంది అన్నారు అంబటి. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పడం లేదని టిడిపి, జనసేన నేతలు విమర్శిస్తున్నారని.. కానీ టిడిపి దుర్మార్గం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయబోయేది సీఎం జగనే అని ధీమా వ్యక్తం చేశారు.