Breaking : జైలు నుంచి విడుదలైన జనసైనికులు

-

ఇటీవల వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన తరువాత తిరిగి వెళ్తున్న వైసీపీ మంత్రులపై జనసైనికులు దాడి చేసిన ఘటన తెలిసిందే. అయితే.. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఏపీ మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై దాడికి దిగిన జనసేన నేతలు శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. విశాఖ గర్జనకు హాజరైన వైసీపీ నేతలు తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టుకు రాగా… అదే సమయంలో విశాఖకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు జన సైనికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల కార్లపై వారు దాడికి దిగారు.

Jana Sena office looks deserted while YCP, TDP offices are crowded

ఈ కేసులో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా…వారిలో 61 మందికి స్థానిక కోర్టు ఆ రోజే బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మిగిలిన 9 మందికి స్థానిక కోర్టు రిమాండ్ విధించగా… వారంతా విశాఖ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలన్న నిందితుల పిటిషన్లను స్థానిక కోర్టు కొట్టివేయగా… తాజాగా వారంతా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మొత్తం 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత శనివారం 9 మంది జనసేన నేతలను విడుదల చేశారు విశాఖ జైలు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news